Pm Modi china tour: ఏడేళ్ల తర్వాత.. చైనాకు వెళ్లిన ప్రధాని మోదీ.. రెడ్ కార్పెట్తో ఘనస్వాగతం చైనీయులు

Pm Modi china tour: ఏడేళ్ల తర్వాత.. చైనాకు వెళ్లిన ప్రధాని మోదీ.. రెడ్ కార్పెట్తో ఘనస్వాగతం చైనీయులు

ప్రధాని మోదీ రెండు రోజుల జపాన్ పర్యటన ముగించుకొని నేరుగా చైనాకు వెళ్లారు. శనివారం (ఆగస్టు30) మధ్యాహ్నం చైనాలోని టియాంజిన్ లో ల్యాండ్ అయ్యారు. ప్రధాని మోదీకి చైనీయులు రెడ్ కార్పొట్ తో స్వాగతం పలికారు. మోదీ రెండు రోజుల పాటు చైనాలో పర్యటించనున్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1న జరిగే షాంఘై కో ఆపరేటివ్ ఆర్గనైజేషన్ సమ్మిట్ లో పాల్గొననున్నారు. 

ఈ సమ్మిట్ లో ప్రాంతీయ భద్రత, సరిహద్దు వివాదాలు, ఆర్థిక సహకారం, వాణిజ్య సంబంధాల వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరగనున్నాయి. SCO దేశాల మధ్య ఉగ్రవాద నిర్మూలన, మౌలిక వసతుల అభివృద్ది, సాంకేతిక పరిజ్ణానంలో భాగస్వామ్యం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. 

గత ఏడేళ్లలో భారత్ చైనా సరిహద్దు వివాదాల కారణంగా దౌత్యసంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇలాంటి సమయంలో ప్రధాని మోదీ చైనా పర్యటన వ్యూహాత్మకంగా చాలా కీలకం. ఈ పర్యటనతో రెండు దేశాల మధ్య విభేధాలు తగ్గించే దిశగా చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

అదే సమయంలో భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు, టారిఫ్ టెన్షన్ క్రమంలో ప్రధాని మోదీ జపాన్, చైనా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. జపాన్ తో ఆర్థిక,సాంకేతిక సహకారం పెంపు, చైనాతో రాజకీయ, ఆర్థిక సమతుల్యత సాధించడం ద్వారా భారత్ తన అంతర్జాతీయ స్థానాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ ఈ పర్యటన ద్వారా భారత్ గ్లోబల్ స్థాయిలో తన వ్యూహాత్మక దౌత్యాన్ని మరింత బలపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.