ఉక్రెయిన్, పోలాండ్ టూర్ కంప్లీట్.. ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ

ఉక్రెయిన్, పోలాండ్ టూర్ కంప్లీట్.. ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ

పోలాండ్, ఉక్రెయిన్ రెండు దేశాల్లో తన పర్యటన ముగించుకొని శనివారం (ఆగస్టు 24, 2024) ఢిల్లీకి చేరుకున్నారు ప్రధాని మోదీ.పర్యటనలో భాగంగా పీఎం మోదీ..ఈ రెండు దేశాల ప్రధానులతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రస్తుతం గందరగోళ ప్రపంచ పరిణామాల మధ్య భారత్ దౌత్యపరమైన కీలక చర్చలు జరిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 21 బుధ వారం పోలాండ్ , ఉక్రెయిన్‌లలో పర్యటన ప్రారంభించిన.. మూడు రోజుల ల పాటు ఈ రెండు దేశాల్లో కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. దౌత్యపరంగా ప్రధాని మోదీ కీరోల్ పోషించారు. 

పోలాండ్ లో ప్రధాని మోదీ.. 

భారత్, పోలాండ్ మధ్య 70 ఏళ్లుగా దౌత్య  సంబంధాలను కొనసాగుతున్నాయి. అయితే గత 45 ఏళ్లలో ఏ ప్రధాని కూడా పోలాండ్ ను సందర్శించలేదు.. తాజాగా ఇన్ని సంవత్సరాల తర్వాత పోలాండ్ సందర్శించిన ఘనత మోదీ కి దక్కింది. పర్యటనలో భాగంగా పోలాండ్ లో ఉన్న ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. గత కొన్నేళ్లుగా భారత్ పురోగతి, వసుదైవ కుటుంబం  అనే భారత్ తత్వా్న్ని పోలాండ్ వాసులకు వివరించారు మోదీ. 

ALSO READ | యుద్ధం వద్దు కూర్చొని మాట్లాడుకోండి: మోదీ

మరోవైపు పోలాండ్ ప్రధాని కూడా పలు దౌత్య పరమైన అంశాలపై మాట్లాడారు. భారత్ తో వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై ప్రధాని మోదీతో చర్చించారు. 

ఉక్రెయిన్ లో మోదీ.. 

శుక్రవారం ఆగస్టు 23, 2024న ప్రధాని మోదీ ఉక్రెయిన్ లో పర్యటించారు. ఉక్రెయిన్ చేరుకున్న ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్వాగతం పలికారు.. ప్రధాని మోదీని హగ్ చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.. అనంతరం ఉక్రెయిన్ యుద్దం, తాజా పరిస్థితులు, శాంతి చర్చల వంటి పలు అంశాలపై జెలెన్ స్కీ , మోదీ చర్చించారు. అనంతరం శనివారం మధ్యాహ్నం ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు ప్రధాని మోదీ.