G20 సమ్మిట్.. ప్రధాని మోదీ 6 పాయింట్ల ఎజెండా ఇదే

G20 సమ్మిట్.. ప్రధాని మోదీ 6 పాయింట్ల ఎజెండా ఇదే

దక్షిణాఫ్రికాలోని జెహాన్నెస్ బర్గ్ లో  జరిగిన G20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ పలు కీలక సంస్కరణలకు ప్రతిపాదనలు చేశారు. AI దుర్వినియోగం నియంత్రణ, భద్రతా మండలిలో సంస్కరణలు, గ్లోబల్ హెల్త్ కేర్ రెస్పాన్స్,  వంటి కీలక ప్రతిపాదనలు చేశారు మోదీ. 

దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా అధ్యక్షతన జరిగిన G20 నేతల శిఖరాగ్ర సమావేశానికి ప్రపంచ  నేతలు హాజరయ్యారు. ఒకరోజు ముందుగానే జోహెన్నెస్ బర్గ్ చేరుకున్న ప్రధాని మోదీ ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని చర్చలు జరిపారు. 

సమావేశాల సందర్భంగా  ప్రధాని మోదీ  G20  దేశాల నేతృత్వంలో కొత్త చొరవకు భారత్ తరపున ఆరు ప్రధాన ప్రతిపాదనలు  సమర్పించారు. 

  •  డ్రగ్స్, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు డ్రగ్స్ అక్రమ రవాణాపై తక్షణ చర్యలు చేపట్టాలని మొదటి ప్రతిపాదన చేశారు. 
  • G20  సభ్య దేశాలనుంచి గ్లోబల్ హెల్త్ కేర్ రెస్పాన్ టీం ను  ఏర్పాటు చేయాలని కోరారు. 
  • ఆఫ్రికా అభివృద్ధికి శ్రామిక శక్తి నిర్మించేందుకు  G20 ఆఫ్రికా స్కిల్స్ మల్టిప్లయర్ ఇన్నోవేటివ్ ను మోదీ సూచించారు. 
  • గ్లోబల్ ట్రేడిషనల్ నాలెడ్జ్ రిపోసిటరీ స్థాపనకు  ప్రధాని మోదీ ప్రతిపాదించారు. 
  • G20 ఓపెన్ శాటిలైట్ డేటా భాగస్వామ్యం
  • ఖనిజ రంగం అభివృద్ధికి G20 క్రిటికల్ మినరల్స్ సర్క్యులారిటీ ఇనిషియేటివ్ వంటి ఆరు ప్రతిపాదనలను ప్రధాని మోదీ G20 సమావేశంలో  సూచించారు.