బయోడైవర్సిటీని కాపాడటంలో ముందున్నం

బయోడైవర్సిటీని  కాపాడటంలో ముందున్నం

చెన్నై: బయోడైవర్సిటీని కాపాడటం, పునరుద్ధరించడంలో భారతదేశం ముందంజలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. జీ20 ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్, క్లైమేట్ సస్టెయినబిలిటీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా మోదీ మాట్లాడారు. ‘‘2030 లక్ష్యం కంటే తొమ్మిదేళ్లు ముందుగా.. శిలాజ ఇంధన వనరుల నుంచి ఇండియా తన లక్ష్యాన్ని సాధించింది. రిన్యూవబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎనర్జీ కెపాసిటీ విషయంలో ఇప్పుడు ప్రపంచంలోని టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 5 దేశాల్లో ఇండియా ఉంది” అని చెప్పారు. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, సీడీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ, లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ తదితర కూటముల ద్వారా తమ భాగస్వాములతో కలిసి పని చేస్తూనే ఉన్నామని వివరించారు. ‘‘ఇండియా ఒక మెగా-వైవిధ్య దేశం. జీవవైవిధ్య పరిరక్షణ, పునరుద్ధరణ చర్యలు తీసుకోవడంలో ముందంజలో ఉంది. కార్చిచ్చులు, మైనింగ్ కారణంగా ప్రభావితమైన వాటిని పునరుద్ధరించే ప్రక్రియను ‘గాంధీనగర్ ఇంప్లిమెంటేషన్ రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్యాప్, ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్’ ద్వారా మీరు చూస్తున్నారు” అని చెప్పారు.

ప్రాజెక్టు టైగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మంచి ఫలితాలు 

‘ప్రాజెక్టు టైగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ఫలితాల వల్ల.. ఇప్పుడు ప్రపంచంలోని 70% టైగర్లు ఇండియాలోనే ఉన్నాయి. ‘ప్రాజెక్టు లయన్’, ‘ప్రాజెక్టు డాల్ఫిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లపైనా ఇప్పుడు పని చేస్తున్నాం” అని ప్రధాని వివరించారు. నీటి సంరక్షణ కోసం ‘మిషన్ అమృత్ సరోవర్’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కింద ఏడాదిలోనే 63 వేల వాటర్ బాడీలను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ‘కాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ది రైన్’ ప్రాజెక్టుతోనూ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అద్భుత ఫలితాలను సాధించినట్లు మోదీ చెప్పారు. గంగా నదిని పరిశుభ్రపరిచేందుకు ‘నమామీ గంగే మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ను ప్రారంభించినట్లు తెలిపారు.  ‘‘ప్రకృతి మనకు ఎంతో ఇస్తుంది. మనం కూడా ప్రకృతికి అందించాలి. మాతృభూమిని రక్షించడం మన ప్రాథమిక బాధ్యత” అని చెప్పారు.