పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. శుక్రవారం ఉదయం కోల్‌కతాలోని హుగ్లీ నది తీరంలో కాసేపు ప్రశాంతంగా గడిపారు. నదిలో బోటు ప్రయాణం చేస్తూ, గంగా మాతకు నమస్కరించారు. స్వయంగా కెమెరా పట్టుకొని హుగ్లీ నది అందాలను, ఐకానిక్ హౌరా బ్రిడ్జ్, విద్యాసాగర్ సేతులను ఫొటోలు తీశారు. వీటికి సంబంధించిన చిత్రాలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘‘బెంగాలీల జీవితాల్లో గంగానదికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దాని జలాలు ఒక ప్రాచీన నాగరికత స్ఫూర్తిని మోసుకెళ్తాయి” అని రాసుకొచ్చారు.

