
ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. కొత్తగా నిర్మించిన ప్రగతి మైదాన్ కన్వెన్షన్ సెంటర్ లో దాదాపు 4 గంటల పాటు ఈ సమావేశం సాగింది. పార్టీ, ప్రభుత్వ అంశాలపై ప్రధానంగా చర్చించింది కేబినెట్. ఈ భేటీలో ముఖ్యంగా తొమ్మిదేళ్ల పాలనతో పాటుగా తెలంగాణతో పాటుగా ఐదు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై చర్చించారని సమాచారం. ఈ అసెంబ్లీ ఎన్నికలకు ఐదు రకాల వ్యూహాలతో ముందుకు వెళ్లాలని చర్చించినట్లుగా తెలుస్తోంది
కేబినెట్ సమావేశం ఫలప్రదంగా జరిగిందని మోడీ ట్వీట్ చేశారు. విధానపరమైన నిర్ణయాలపై చర్చించినట్టు ప్రధాని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అలాగే ఈ కీలక భేటీకి సంబంధించిన ఫొటోలను ఆయన షేర్ చేశారు. మంత్రి మండలిలో మార్పులు, చేర్పులు ఉంటాయని ప్రధానంగా ప్రచారం జరిగింది. 2019లో రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మోడీ ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే కేంద్రమంత్రి మండలిని విస్తరించారు.