కొత్త పార్లమెంట్..  భవన  నిర్మాణ కార్మికులను మోడీ  సన్మానం 

కొత్త పార్లమెంట్..  భవన  నిర్మాణ కార్మికులను మోడీ  సన్మానం 

కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోడీ 2023 మే 28 ఆదివారం ప్రారంభించారు.  ఈ సందర్భంగా కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ పనుల్లో పాలుపంచుకున్న కార్మికులను మోడీ సత్కారించారు. వారికి శాలువాలు కప్పి జ్ఞాపికలను అందజేశారు మోడీ. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కింద కొత్త పార్లమెంటు భవనం నిర్మించారు. అలాగే పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా సర్వ మత ధర్మ ప్రార్ధనలు నిర్వహించారు. సర్వ మత ధర్మ ప్రార్ధనల్లో ప్రధాని మోడీ, కేంద్ర మం త్రులు, ప్రముఖులు,వేద పండితులు పాల్గొన్నారు.

సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ఖర్చు దాదాపు రూ. 20 వేల కోట్లు. ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా.. పూర్తిగా భారతీయత ఉట్టిపడేలా కేంద్ర ప్రభుత్వం ఈ భవనాన్ని నిర్మించింది.  అంతకుముందు పార్లమెంటుకు చేరుకున్న ప్రధాని మోడీకి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా స్వాగతం పలికారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి మోడీ నివాళులర్పించారు. అనంతరం అక్కడ జరిగిన యాగంలో పాల్గొన్నారు. స్పీకర్‌తో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు మోడీ.  

కొత్త  పార్లమెంట్ విశేషాలు

  • 2020 డిసెంబర్ 10న ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి శంకస్థాపన చేశారు.
  • పాత పార్లమెంట్ భవనంలో లోక్‌సభ 545, రాజ్యసభలో 250 మంది సభ్యులు కూర్చునే సీటింగ్ కెపాసిటి ఉండేది.
  • కొత్త భననంలో లోక్‌సభ 888 మంది సభ్యులు, రాజ్యసభలో 384 మంది సభ్యులు కూర్చునే సీటింట్ కెపాసిటీని ఏర్పాటు చేశారు.
  • కొత్త పార్లమెంట్ భవన నిర్మాణంలో 64,500 చదరపు మీటర్లు స్థలంలో నిర్మించారు.
  • సెంట్రల్ విస్తా భవన సముదాయ వరుసక్రమంలో త్రిభుజాకారంలో పార్లమెంట్ భవన నిర్మాణం చేపట్టారు. దీనిలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, రాజ్యాంగ బద్ధ సంస్థల కార్యాలయాలు ఉంటాయి.
  • కొత్త లోక్‌సభ ఛాంబర్‌ను జాతీయ పక్షి నెమలి ఆకృతిలో నిర్మించారు.
  • రాజ్యసభ ఛాంబర్‌ను జాతీయ పుష్పం ఆకృతిలో నిర్మించారు. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనంలో నిర్మాణం భారతీయ నిర్మాణ వారసత్వం ప్రతిబింబించేలా నిర్మించినట్లు తెలుస్తోంది.