సోనియా గాంధీకి .. మోదీ బర్త్ డే విషెస్

సోనియా గాంధీకి ..  మోదీ బర్త్ డే విషెస్

సోనియా గాంధీ 77వ పుట్టినరోజు సందర్భంగా  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మోదీ ట్వీట్ చేశారు.  శ్రీమతి సోనియా గాంధీ గారికి  శుభాకాంక్షలు.  మీరు ఆయరారోగ్యలతో జీవించాలని ఆకాంక్షిస్తున్నా అని  మోదీ తన ట్వీట్ లో తెలిపారు.  మోదీతో పాటుగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, శశి థరూర్, తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ కూడా సోనియా గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు.

ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  కాగా సోనియా గాంధీ గత కొన్నేళ్లుగా ఆరోగ్య కారణాల రీత్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు.