నలంద యూనివర్సిటీలో కొత్త క్యాంపస్ ప్రారంభించిన పీఎం మోదీ

నలంద యూనివర్సిటీలో కొత్త క్యాంపస్ ప్రారంభించిన పీఎం మోదీ

బిహార్ లోని నలంద విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు ప్రధాని మోదీ.  విశ్వవిద్యాలయంలోని కట్టడాలను పరిశీలించారు. రాజ్ గిర్ లోని నలంద విశ్వవిద్యాలయంలో కొత్త క్యాంపస్ ను ప్రారంభించారు ప్రధాని. పురాతన నలంద యూనివర్సిటీని 2016లో వారసత్వ సంపదగా ప్రకటించింది యునెస్కో. కొత్తగా నిర్మించిన క్యాంపస్ లో  రెండు అకడమిక్ బ్లాక్స్ ఉన్నాయి. 

వీటిలో 19వందల మంది విద్యార్థుల సీటింగ్ కెపాసిటీ ఉంది.3వందల సీట్ల సామార్థ్యంతో రెండు ఆడిటోరియాలు ఏర్పాటు  చేశారు. సుమారు 550 మంది విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కల్పించారు.  ఈస్ట్ ఆసియా సమ్మిట్ దేశాల సహకారంతో నెట్ జీరో గ్రీన్ క్యాంపస్ గా నిర్మించారు అధికారులు. కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవంలో  17దేశాలకు చెందిన ప్రతినిధులతో పాటు ప్రముఖులు హాజరయ్యారు.
 
నలంద విశ్వవిద్యాలయాన్ని కీస్తుశకం 427లో స్థాపించిన ప్రపంచంలోనే తొలి రెసిడెన్షియల్ యూనివర్సిటీగా చెప్తుంటారు చరిత్రకారులు. అప్పట్లోనే తూర్పు ఆసియా, మధ్య ఆసియా ప్రాంతాల నుంచి  10వేల మందికిపైగా విద్యార్థులు ఇక్కడి వచ్చి చదువుకునేవారు. క్రీస్తుశకం 11వందల 90 ప్రాంతంలో తుర్కో-అప్గాన్ మిలటరీ  జనరల్ భక్తియార్ ఖిల్జీ  నేతృత్వంలోని దోపిడి దళాలు.. ఉత్తర, తూర్పు భారత దేశంపై దండయాత్ర  చేసినప్పుడు నలంద విశ్వవిశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేశారు.