పెద్దపల్లి జిల్లా రామగుండంతో పాటుగా దేశంలోని 18 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలలో 100 వాట్స్ సామర్థ్యం కలిగిన 91 FM ట్రాన్స్‌మిటర్‌లను ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 28 శుక్రవారం రోజున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. వినోదం, క్రీడలు, వ్యవసాయం, వాతవారణానికి సంబంధించిన సమాచారాన్ని స్థానిక ప్రజలకు చేరవేయడంలో FM ట్రాన్స్‌మిటర్‌లు కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాని మోడీ అన్నారు.
84 జిల్లాల్లో 91 కొత్త 100 వాట్ల FM ట్రాన్స్‌మిటర్‌లను ఇన్‌స్టాల్ చేయడం జరిగిందని మోడీ తెలిపారు. త్వరలో తాను రేడియోలో 'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్‌లో ప్రసంగిస్తానని మోడీ అన్నారు. దేశప్రజలతో ఈ రకమైన భావోద్వేగ అనుబంధం రేడియో ద్వారా మాత్రమే సాధ్యమైందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటుగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం19 రాష్ర్టాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 84 జిల్లాల్లో ప్రారంభం కానుందని ఆల్ ఇండియా రేడియో వెల్లడించింది. వాటిలో తెలంగాణలోని నల్గొండ జిల్లా దేవరకొండ, నల్గొండ టౌన్, పెద్దపల్లి జిల్లా రామగుండం, అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ తో పాటు ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఉన్నాయని వివరించింది.