రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్ 4,5 తేదీల్లో పుతిన్ భారత్ లో పర్యటించనున్నారు. డిసెంబర్ 5 న జరిగే భారత్, రష్యా శిఖరాగ్ర సమావేశంలో ఫుతిన్ పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కీలక ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. రక్షణ, శక్తి, వాణిజ్యం, వ్యూహాత్మక భాగస్వామ్యం వంటి అంశాలపై రెండు దేశాలు చర్చలు జరిపే అవకాశం ఉంది.
వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం..
డిసెంబర్ 5 నజరిగే 23వ భారత్, రష్యా శిఖరాగ్రవేశం సమావేశం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించనున్నారు. ప్రపంచ రాజకీయ పరిణామాలు, అంతర్జాతీయ వేదికలపై ఇరు దేశాల సహకారం, ప్రాంతీయ ,ప్రపంచ సమస్యలపై ఇరు దేశాల నేతలు అభిప్రాయాలను పంచుకోనున్నారు.
అంతరిక్ష రంగంలో సహకారం అంశాలపై కూడా చర్చలు జరిపే అవకాశం ఉంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, రష్యా చమురు దిగుమతులు, ట్రంప్ సుంకాలు, తాజా ప్రపంచ పరిస్థితులపై ప్రధానిమోదీతో పుతిన్ చర్చించనున్నట్లు పుతిన్ పర్యటనకు సంబంధించి రెండు దేశాలు ధృవీకరించాయి.
