కొమురవెల్లిలో మెదక్ ఎంపీ పూజలు.. ప్రధాని మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు

కొమురవెల్లిలో మెదక్ ఎంపీ పూజలు.. ప్రధాని మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు

కొమురవెల్లి, వెలుగు: దేశ ప్రధానిగా నరేంద్రమోదీ 12 ఏండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు కొమురెల్లి మల్లన్నకు బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ అత్యధిక కాలం(4,399) దేశానికి ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త చరిత్ర సృష్టించారన్నారు. ప్రజాసేవలో ఆయన మరింత సేవలు అందించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ అర్చకులు, అధికారులు స్వామి లడ్డూ ప్రసాదం అందించి శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు.