కాంగ్రెస్ పై అన్ని రాష్ట్రాలు నో కాన్ఫిడెన్స్ ప్రకటించాయి.. కుటుంబ పేర్లంటే కాంగ్రెస్కు వ్యామోహం..

 కాంగ్రెస్ పై అన్ని రాష్ట్రాలు నో కాన్ఫిడెన్స్ ప్రకటించాయి.. కుటుంబ పేర్లంటే కాంగ్రెస్కు వ్యామోహం..

విపక్షాలది ఇండియా కూటమి కాదు..అది ఘమిండియా కూటమి అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు.  ఎన్డీఏలో రెండు Iలు చేర్చారని..మొదటి I   26 పార్టీల అహంకారానికి నిదర్శనమన్నారు. రెండో I  ఒక కుటుంబం అహంకారానికి నిదర్శనమని ఘాటుగా స్పందించారు. ప్రతీ పథకం వెనుక తమ  కుటుంబ పేరును చేర్చిందని మండిపడ్డారు. వీళ్ల పేర్ల మీద ఎన్నో పథకాలను పెట్టుకున్నారని..పేర్లు కనిపిస్తాయి కాని..వీళ్ల పని మాత్రం ఎక్కడా కనిపించదని చురకలంటించారు. కాంగ్రెస్ కు పేర్ల మీదున్న వ్యామోహం ఈనాటిది కాదన్నారు. తమ పేర్లతో పెట్టుకున్న పథకాలతో కాంగ్రెస్  కోట్లు దండుకుందని ఆరోపించారు. పేర్లు మార్చుకుంటే దేశంలో అధికారం చలాయించవచ్చని అనుకుంటారని మండిపడ్డారు.

 కాంగ్రెస్ వ్యవస్థాపకుడు ఏవో  హ్యుమ్స్ విదేశీయుడు అని ప్రధాని మోదీ గుర్తు చేశారు.  అన్ని ఒకే కుటుంబం చేతిలో ఉన్నాయని  ఆ పార్టీ గుర్తు చెప్తుందన్నారు.  కాంగ్రెస్ ది  ఇండియా కూటమి కాదని.. అది...అహంకారుల కూటమి అన్నారు. ఆ కూటమిలో ఉన్న ప్రతీ ఒక్కరు ప్రధాని కావాలని కోరుకుంటారని చెప్పారు.  కాంగ్రెస్ ను యూపీ, బీహార్; గుజరాత్ ప్రజలు తిరస్కరించారని..,.ఒడిశాలో  కాంగ్రెస్ ను 28 ఏళ్లుగా తిరస్కరిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పై అన్ని రాష్ట్రాలు నో కాన్ఫిడెన్స్ ప్రకటించాయని ఎద్దేవా చేశారు.  కుటుంబ రాజకీయాలను స్వాతంత్య్ర వీరులు వ్యతిరేకించారని గుర్తు చేశారు. గాంధీ నుంచి అంబేద్కర్ వరకు కుటుంబ రాజకీయాలు వద్దన్నారని మోదీ తెలిపారు. కానీ కుటుంబ రాజకీయాలు, దర్బారు రాజకీయాలు అంటే కాంగ్రెస్ కు ఇష్టమన్నారు. 

వయనాడ్ లో కాంగ్రెస్ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన వారితో అంటకాగారని ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విమర్శించారు. మోదీ అంటే కాంగ్రెస్ వాళ్లకు ఎంతో ప్రేమ..అందుకే నిద్రలోనూ కలవరిస్తూ  ఉంటారని ఎద్దేవా చేశారు. తాను నీళ్లు తాగినా వాళ్లే తాగించామని గొప్పగా చెప్పుకుంటారని చురకలంటించారు. కాంగ్రెస్ కష్టాలు తనకు తెలుసు అని..వాళ్లు ఫెయిల్డ్ ప్రాడెక్టును పదే పదే లాంచ్ చేస్తుంటారని విమర్శించారు. కానీ ప్రతీ సారి ఆ లాంచింగ్ ఫెయిల్ అవుతూనే ఉంటుందని..వాళ్ల లాంచింగ్ ఫెయిల్ అయితే జనాలపై ధ్వేషం పెంచుకుంటారని చెప్పారు. కాంగ్రెస్ ది అబద్దాల దుకాణం అని..వీళ్ల పప్పులు ఉడకడం లేదు..అందుకే కొత్త దుకాణాలు తెరుస్తున్నారని మండిపడ్డారు.