
ప్రధాని మోదీ రష్యా పర్యటన రద్దు అయ్యింది. షెడ్యూల్ ప్రకారం 2025, మే 9వ తేదీన రష్యాలో పర్యటించాల్సి ఉంది మోదీ. మే 9వ తేదీ.. రష్యా విజయ దినోత్సవ వేడుకలు. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై విజయం తర్వాత.. రష్యా ఈ ఉత్సవాలను చేస్తుంది. 80 ఏళ్లుగా.. ప్రతి ఏటా మే 9వ తేదీన విజయ దినోత్సవాలను నిర్వహిస్తుంది. ఈ వేడుకలకు.. ప్రపంచంలోని దేశాధినేతలను ఆహ్వానిస్తుంది. అందులో భాగంగా ఈసారి మన ప్రధానమంత్రి మోదీకి ఆహ్వానం అందింది. ఇందులో భాగంగానే రష్యా పర్యటించాల్సి ఉంది మోదీ.
ఇండియాలో ఉద్రిక్త పరిస్థితులు. పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ దేశంతో నెలకొన్న వాణిజ్య, దౌత్య పరమైన యుద్ధం క్రమంలో అత్యంత కీలక సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు మోదీ. ఇలాంటి సమయంలో రష్యా పర్యటన చేయటం భావ్యం కాదని భావించిన మోదీ.. తన రష్యా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని రష్యా ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ కూడా ధృవీకరించారు.
►ALSO READ | యుద్ధానికి సిద్ధమేనా : మోదీ అధ్యక్షతన సూపర్ కేబినెట్ భేటీ : ఆరేళ్ల తర్వాత ఇలాంటి మీటింగ్
పహల్గాంలో ఉగ్రదాడి సమయంలోనూ మన ప్రధాని మోదీ.. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు. దాడి విషయం తెలుసుకుని పర్యటన రద్దు చేసుకుని ఇండియా చేరుకున్నారు. ఇప్పటికే భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన మన ప్రధాని మోదీ.. సూపర్ కేబినెట్ భేటీ కూడా నిర్వహించారు. ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా వదిలేది లేదని ఇప్పటికే ప్రకటించిన మోదీ.. ఇప్పుడు పాకిస్తాన్ దేశంపై. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై ఏ క్షణమైన దాడి చేసే అవకాశాలు లేకపోలేదు.