
ప్రధాని మోడీ నిన్న రాత్రి హ్యూస్టన్ నుంచి న్యూయార్క్ చేరుకున్నారు. ఇవాళ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆధ్వర్యంలో వాతావరణ మార్పులపై జరగనున్న సదస్సులో మోడీ పాల్గొంటారు. అలాగే సార్వత్రిక వైద్యసేవలపై గుటెరస్ నేతృత్వంలో జరగనున్న మరో సదస్సుకు హాజరవుతారు. అక్కడ ఆయుష్మాన్ భారత్ పథకం గురించి వివరిస్తారు. దాంతో పాటు ఉగ్రవాదులకు వ్యూహాత్మక సమాధానాలు అనే అంశంపై జరిగే కార్యక్రమంలోనూ మోడీ మాట్లాడతారు. గుటెరస్ తో పాటు జోర్డాన్ రాజు, ఫ్రాన్స్ అధ్యక్షుడు, న్యూజీలాండ్ ప్రధానుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనుంది. కెన్యా, ఇండోనేషియా అధ్యక్షులు కూడా ఈ మీటింగ్ లో పాల్గొంటారు.