బీజేపీ గెలిస్తే..బీసీలదే రాజ్యాధికారం: ప్రధాని మోదీ

బీజేపీ గెలిస్తే..బీసీలదే రాజ్యాధికారం: ప్రధాని మోదీ

హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మ గౌరవ సభ జరిగింది. ఈ సభకు ప్రధాని మోదీ తో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. ఓపెన్ టాప్ జీపులో ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధాని మోదీ సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

 ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. బీసీ ఆత్మ గౌరవ సభలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఎల్బీ స్టేడియంతో నాకు అనుబంధం ఉంది. ఇదే గ్రౌండ్ లో ప్రజల ఆశీర్వాదంతో నేను ప్రధానిని అయ్యానని మోదీ చెప్పారు. 2023లో బీసీ ముఖ్యమంత్రి చేయాలని ఇక్కడి నుంచే నిర్ణయం జరగాలని ప్రధాని మోదీ అన్నారు. బీఆర్ ఎస్ పార్టీ బీసీని ఎందుకు సీఎం చేయడం లేదని మోదీ ప్రశ్నించారు. 

తెలంగాణలో తొమ్మిదేళ్ళుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక పాలన సాగుతోందని ప్రధాని మోదీ ఆరోపించారు. నవంబర్ 30న ఈ విరోధి సర్కార్ ను విసిరి కొట్టాలని మోదీ అన్నారు. బీజేపీ సర్కార్ దళిత, ఆదివాసీలకు ప్రియారిటీ ఇస్తోందన్నారు మోదీ. రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్రపతిని చేశామని.. గిరిజన బిడ్డను ఇప్పుడు రాష్ట్రపతిని చేశామని మోదీ స్పష్టం చేరశారు. ఓబీసీలకు ఏ పార్టీ ప్రియారిటీ ఇవ్వలేదని అన్నారు మోదీ. కేంద్ర కేబినెట్ లో 27 మంది ఓబీసీలున్నారని అన్నారు ప్రధాని. డెంటల్ కాలేజీల్లో 27 శాతం ఓబీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నామని అన్నారు. బీసీని వ్యక్తిని ప్రధానిని చేసి నన్ను గౌరవించారన్నారు.