చంద్రయాన్ – 3 ఇండియా కలలను నిజం చేయాలి : ప్రధాని మోదీ సందేశం

చంద్రయాన్ – 3 ఇండియా కలలను నిజం చేయాలి : ప్రధాని మోదీ సందేశం

భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) ఇండియా కలల్ని నిజం చేస్తూ చంద్రయాన్​– 3 ని  విజయవంతంగా ప్రయోగించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. జులై 14న చంద్రయాన్​‌‌ – 3 ప్రయోగం సందర్భంగా ఆయన ట్వీట్​ చేశారు. 'అంతరిక్ష రంగంలో జులై 14, 2023 చరిత్రలో నిలిచిపోతుంది. జాబిల్లిపైకి చంద్రయాన్​ 3 ప్రయాణం మొదలు కానుంది. కోట్ల మంది ప్రజల ఆశల్ని ఈ రాకెట్​ నింగిలోకి తీసుకువెళ్తుంది.' అని ప్రధాని ట్వీట్​లో పేర్కొన్నారు. 

భవిష్యత్తులో చంద్రుడిని ఆవాసయోగ్యంగా మార్చుకోవచ్చేమోనని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇస్రో శుక్రవారం   శ్రీహరికోటలోని సతీష్​ధవన్​స్పేస్​సెంటర్ నుంచి అత్యంత ప్రతిష్ఠాత్మక చంద్రయాన్‌-3 ప్రయోగానికి రెడీ అయింది. అంతా సవ్యంగా జరిగితే- మధ్యాహ్నం 2.35 గంటలకు ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌  నింగిలోకి దూసుకెళ్లనుంది. బాలీవుడ్ ప్రముఖులు అజయ్ దేవ్‌గణ్​, అనుపమ్ ఖేర్  తదితరులు శాస్ర్తవేత్తల బృందానికి గుడ్​లక్​ చెప్పారు.

చందమామ ప్రయాణం అంటే అన్ని దేశాలకు ఆసక్తి ఎక్కువే. అక్కడికి వెళ్లాలని మనిషి జీవించడానికి అనుకూలమైన వాతావరణం ఉందా.. తదితర కోణాల్లో ప్రయోగాలు చేయడానికి తప్పకుండా వెళ్లాలని చాలా దేశాలు కోరుకుంటాయి. అందులో భాగంగా కొన్ని దేశాలు సక్సెస్​ అయ్యాయి.మరొ కొన్ని ఫెయిల్​అయ్యాయి. ఇప్పుడు భారత్​మరో ప్రయోగం ప్రపంచదేశాలను మన వైపు తిప్పుకునేలా చేసింది.