ట్రాక్టర్​ కాలబెట్టి కాంగ్రెస్ రైతుల్ని అవమానించింది

ట్రాక్టర్​ కాలబెట్టి కాంగ్రెస్ రైతుల్ని అవమానించింది

కాంగ్రెస్ పార్టీపై మోడీ ఫైర్​

దళారులు బాగు పడాలని కోరుకుంటున్నారని విమర్శలు
ఉత్తరాఖండ్ లో సీవెజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ప్రారంభోత్సవం

డెహ్రాడూన్: రైతులు దైవంగా పూజించే మెషిన్లు, ఎక్విప్ మెంట్స్ ను తగలబెట్టి కాంగ్రెస్ పార్టీ వారిని అవమానించిందని ప్రధాని మోడీ అన్నారు. అగ్రి చట్టాలపై ఆందోళనల్లో భాగంగా ఢిల్లీలో ట్రాక్టర్ ను తగలబెట్టడాన్ని తప్పుబట్టారు. రైతులు కాదు, దళారులు బాగుపడాలనే కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందని విమర్శించారు. రైతుల స్వేచ్ఛను వ్యతిరేకిస్తున్నారని, వాళ్లు ఎప్పుడూ కష్టాల్లోనే ఉండాలని కోరుకుంటున్నారని మండిపడ్డారు. మంగళవారం నమామీ గంగె కార్యక్రమంలో భాగంగా ఉత్తరాఖండ్ లోని హరిద్వార్, రిషికేశ్​, మునికిరేటి, బద్రీనాథ్ లో  ఆరు సీవేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్స్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘దశాబ్దాలుగా కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారు. వాటి నుంచి స్వేచ్ఛ కల్పించేందుకే అగ్రి చట్టాలను తీసుకొచ్చాం. కనీస మద్దతు ధర ఉంటుంది. రైతులు దేశంలో ఎక్కడైనా తమ పంటను అమ్ముకోవచ్చు. అగ్రి చట్టాలపై అబద్ధాలు ప్రచారం చేసి, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. బ్లాక్ మనీ సోర్స్ బంద్ అయ్యిందని అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు’ అని కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు.

ప్రతీదాన్ని వ్యతిరేకించడమే వారి పని…

ప్రతి అంశాన్ని వ్యతిరేకించడం, రాజకీయం చేయడమే ప్రతిపక్షానికి పనిగా మారిందని ప్రధాని మోడీ విమర్శించారు. జీఎస్టీ, వన్ ర్యాంక్ వన్ పెన్షన్, రఫెల్ డీల్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, పేదలకు 10 శాతం రిజర్వేషన్లు, నవంబర్ 26ను కానిస్టిట్యూషనల్ డే గా జరుపుకోవడం లాంటి అంశాలను ప్రతిపక్షం వ్యతిరేకించిందని మండిపడ్డారు. నాలుగు తరాలు దేశాన్ని పాలించిన పార్టీ అధికారానికి దూరమై ఫ్రస్ట్రేషన్ తో ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తోందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కు గుర్తుగా నిర్మించిన స్టాట్యూ ఆఫ్ యూనిటీని కాంగ్రెస్ నేతలు ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు. కేంద్రం ప్రవేశపెట్టిన జన్ ధన్ స్కీమ్ ను కూడా కాంగ్రెస్ వ్యతిరేకించిందని, అయితే కరోనా టైమ్ లో అది తమకు ఎలా ఉపయోగపడిందో నగదు బదిలీ ద్వారా ప్రజలకు అర్థమైందన్నారు. అయోధ్యలో రాముడి ఆలయ నిర్మాణాన్ని సుప్రీంకోర్టులో దశాబ్దాలపాటు నాన్చారని, చివరకు శంకుస్థాపనను కూడా వ్యతిరేకించారని చెప్పారు. సర్జికల్ స్ట్రైక్ పై అనుమానాలు వ్యక్తం చేశారని అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎయిర్ ఫోర్స్ ను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోని పార్టీ.. రఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలును అడ్డుకునేందుకు ప్రయత్నించిందన్నారు. రైతులు, లేబర్స్, యూత్, మహిళల కోసం సంస్కరణలు తీసుకొచ్చామని, అయితే వీటిని ప్రతిపక్షాలు ఎలా అపోజ్ చేస్తున్నాయో దేశ ప్రజలు చూస్తున్నారని అన్నారు.

వర్క్ కల్చర్ మారింది..

గత ప్రభుత్వాలు గంగా శుద్ధీకరణ, తాగునీరు, ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం డబ్బులు వృథా చేశాయని, వాటి వల్ల ఎలాంటి ఫలితాలు రాలేదన్నారు. ప్రభుత్వం, శాఖల మధ్య సమన్వయం లేకపోవడమే దీనికి కారణమని అన్నారు. తమ పాలనలో వర్క్ కల్చర్ మారిందని, ప్రతి పైసా ప్రాజెక్టు అమలు కోసం పక్కాగా ఖర్చు పెడుతున్నట్లు చెప్పారు.

For More News..

ఇండియాకు గుడ్ బై చెప్పిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్

15 రోజులు పోరాడి ఓడిన మరో నిర్భయ