భారత్ కృషిని ప్రపంచం ప్రశంసిస్తోంది

భారత్ కృషిని ప్రపంచం ప్రశంసిస్తోంది

భారత్ వేగంగా 100 కోట్ల మైలు రాయిని దాటిందన్నారు ప్రధాని మోడీ. 100 వంద కోట్ల వ్యాక్సినేషన్ పూర్తైన సందర్భంగా శుక్రవారం జాతినుద్దేశించి మాట్లాడిన మోడీ.. వ్యాక్సిన్ పంపిణీ ద్వారా భారత్ శక్తి చూపించామన్నారు. అక్టోబర్ 21 నాటికి 100 కోట్ల డోసుల పంపిణీ పూర్తయిందన్నారు. ఇది ఒక సువర్ణ అథ్యాయమని..ఈ ఘనత వెనుక 130 కోట్ల భారతీయుల కృషి ఉందన్నారు. భారత్ కృషిని ప్రపంచం ప్రశంసిస్తుందని తెలిపారు. చప్పట్లు, దీపాలు వెలిగించడని చెప్తే కరోనా పోతుందా అని విమర్శించారన్నారు. దేశమంతా ఒకటేనని చెప్పేందుకే ఈ కార్యక్రమాలు చేశామన్న మోడీ..100 కోట్ల రికార్డుతో భారత్ ఫార్మాశక్తి మరోసారి ప్రపంచానికి తెలిసిందన్నారు. 

100  కోట్ల డోసులు కేవలం సంఖ్య కాదని, భారత సామర్థ్యానికి ప్రతీక  అన్నారు. గతంలో వ్యాక్సీన్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్లమని..ఇతర దేశాల నుంచి భారత్ వ్యాక్సీన్ల కొనగలరా? ఇంతపెద్ద జనాభాకు టీకాలు వేయగలరా అన్న సవాళ్లుండేవన్నారు. కానీ ఈ 100 కోట్ల డోసులు ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చిందన్నారు. డబ్బులు తీసుకోకుండా వ్యాక్సీన్లు ఇచ్చామని.. ప్రపంచం మొత్తం భారత సామర్థ్యాన్ని  గుర్తించిందన్నారు ప్రధాని మోడీ.