నెమళ్లు, ఆవులతో మోదీ ముచ్చట.. ఎర్రకోటకు వెళ్లే ముందు రోజు మూగజీవాలతో గడిపిన ప్రధాని

నెమళ్లు, ఆవులతో మోదీ ముచ్చట.. ఎర్రకోటకు వెళ్లే ముందు రోజు మూగజీవాలతో గడిపిన ప్రధాని

న్యూఢిల్లీ: దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి సరిగ్గా ముందురోజు శుక్రవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ తన దినచర్యకు సంబంధించిన ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఆవులు, నెమళ్లకు ఆయన స్వయంగా ఆహారం తినిపిస్తున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి. ‘ప్రతిరోజూ ఉదయం నా మిత్రులకు ఆహారం అందించడం నా దినచర్య. నేను ఎర్రకోటకు వెళ్తున్నానని అవి ముందే గ్రహించి నన్ను కలిసేందుకు వచ్చాయి’ అంటూ మోదీ ఇన్‌‌‌‌‌‌‌‌స్టాలో రాసుకొచ్చారు. ప్రధాని నివాసంలో సంచరించే ఈ మూగజీవాల్లో ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌కు చెందిన అరుదైన పుంగనూరు జాతి ఆవులు కూడా ఉన్నాయి.