దేశ ఐక్యతకు సింబల్ వందేమాతరం అని అన్నారు ప్రధాని మోదీ. కోట్లాది మందికి వందేమాతరం స్ఫూర్తినిచ్చిందన్నారు. వందేమాతరం గీతం150 వ వార్షికోత్సవం సందర్బంగా లోక్ సభలో మాట్లాడిన మోదీ.. వందేమాతరం గీతం స్వతంత్ర్య పోరాటంలో ప్రేరణగా నిలిచిందన్నారు. స్వత్రంత్య్ర సమరయోధులకు ఊపిరిగా నిలిచిందన్నారు. వికసిత్ భారత్ కు వందేమాతరం స్ఫూర్తి అవసరం మన్నారు మోదీ. గాడ్ సేవ్ ద క్వీన్ గీతంతో బ్రిటీష్ వాళ్లు వందేమాతరంను అణచి వేశారనన్నారు. బంకిం చంద్ర ఛటర్జీ తీసుకొచ్చిన ఈ గీతం దేశాన్ని ఏకం చేసిందన్నారు.
ఎమర్జెన్సీ ఉక్కుపాదం కింద వందేమాతరంను తొక్కిపెట్టారని చెప్పారు మోదీ.. వందేమాతరం గీతం ఎన్నో ఘట్టాలను దాటుకుంటూ వెళ్లిందన్నారు. ఉత్తరం నుంచి దక్షిణం..తూర్పు నుంచి పడమర వరకు దేశాన్ని ఏకం చేసిందన్నారు మోదీ. దేశం ముక్కలు కాకుండా వందేమాతరం సాయం చేసిందన్నారు. బెంగాల్ ఐక్యతలో వందేమాతరం పాత్ర ఎనలేనిదన్నారు. బెంగాల్ వీధుల్లో ప్రారంభమై..దేశం నినాదం అయ్యిందని తెలిపారు. వందేమాతరం ఆజాద్ భారత్ కు విజన్ గా మారిందన్న మోదీ.. మన దేశ జ్ఞానం,సమృద్ధికి మారుపేరు వందేమాతరం అని వర్ణించారు. వందేమాతరం గీతం శత్రువలను భయపెట్టిందని చెప్పారు మోదీ.
