న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ రంగంలో భారత్ దూసుకుపోతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సెమీకాన్ ఇండియా 2024 సమ్మిట్ లో ఆయన ప్రసంగించారు. సెమీ కండక్టర్ల ఉత్పత్తికోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. భారత్ లో మరిన్ని చిప్ లు తయారు కావాలి. అందుకు టాప్ గ్లోబల్ చిప్ కంపెనీలు దేశంలో పెట్టుబడులు పెట్టాలి.
ప్రస్తుతం మీరంతా సరైన ప్రదేశంలో ఉన్నారు. తగిన నిర్ణయం తీసుకోండి. ఎలక్ట్రానిక్ రంగంలో భారత్ 150 బిలియన్ డాలర్ల మైలురాయిని చేరుకుంది. ఈ దశాబ్దం చివరికి 500 బిలియన్ డాలర్లకు చేరుకోవడమే లక్ష్యం. దాదాపు 85వేలకు పైగా ఇంజనీర్లు, టెక్నీషియన్లు సెమీకండక్టర్ రంగంలో పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎలక్ట్రానిక్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందన్నారు