
ప్రధాని నరేంద్ర మోడీ మరో వందే భారత్ రైలుకు పచ్చ జెండా ఊపనున్నారు. ఆగస్టు 6న తమిళనాడులో మూడవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును మోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలు చెన్నై టూ తిరునల్వేలి మధ్య నడుస్తుంది. సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పోలిస్తే ఈ వందే భారత్ రైలులో ప్రయాణికులకు రెండు గంటల వరకు సమయం ఆదా అవుతుందని రైల్వే అధికారులు తెలిపారు. 8 కోచ్‌లు ఉన్న ఈ వందే భారత్ రైలు తిరుచ్చి, మదురై రెండు చోట్ల మాత్రమే ఆగుతుంది
అంతకుముందు ఏప్రిల్ 8న చెన్నై- కోయంబత్తూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ఫిబ్రవరి 15, 2019న న్యూఢిల్లీ - వారణాసి మధ్య మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు.