జీ 20 సమ్మిట్ అవ్వగానే.. ఎన్నికల ప్రచారంలోకి మోదీ

జీ 20 సమ్మిట్ అవ్వగానే.. ఎన్నికల ప్రచారంలోకి మోదీ

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 14న మధ్యప్రదేశ్‌లో పర్యటించనున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. బినా రిఫైనరీ ప్రాజెక్ట్ (బిపిసిఎల్) భూమి పూజను నిర్వహించడానికి ప్రధాని మోదీ బినా జిల్లాను సందర్శిస్తారని చౌహాన్ చెప్పారు. “సెప్టెంబర్ 14న బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ప్రధాని పర్యటించడం మధ్యప్రదేశ్ అదృష్టమని, ఇక్కడ, బినా రిఫైనరీ ఉంది. పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నిర్మాణంలో ఉంది. కొత్తది దాదాపు రూ. 50వేల కోట్లతో యూనిట్‌ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి అని ఆయన స్పష్టం చేశారు.

శంకుస్థాపన (భూమి పూజ) కోసం ప్రధాని మధ్యప్రదేశ్ కు రానున్నట్లు చౌహాన్ తెలిపారు. పెట్రో కెమికల్స్‌తో పాటు టెక్స్‌టైల్ పార్క్‌తో సహా మొత్తం రూ.2 లక్షల కోట్లతో వివిధ ప్రాజెక్టులు కూడా ఈ ప్రాంతంలో చేపట్టనున్నారన్నారు. ఈ కానుకతో రాష్ట్రంలో 3 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ముఖ్యమంత్రి చౌహాన్ అన్నారు. ప్రధానమంత్రి మధ్యప్రదేశ్‌కు వచ్చినప్పుడల్లా చాలా బహుమతులు తెస్తారని, సెప్టెంబర్ 14న ప్రధాని నరేంద్ర మోదీ బీనా రిఫైనరీకి వస్తున్నారని, రిఫైనరీతో పాటు మధ్యప్రదేశ్‌కు రూ. 2 లక్షల కోట్ల విలువైన బహుమతిని అందజేస్తారని ఆయన ఆకాంక్షించారు. ఇది యువతకు ఉపాధి, అవకాశాలను సృష్టిస్తుందని చెప్పారు.

ప్రస్తుతం ప్రధాని మోదీ ఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సుపై దృష్టి సారించారు. జీ20 సదస్సు ముగిసిన తర్వాత ఆయన మధ్యప్రదేశ్‌లో పర్యటించనున్నారు. చివరిసారిగా, ప్రధాని మోదీ ఆగస్టు 12న సాగర్ జిల్లాలో సంత్ రవిదాస్ ఆలయానికి శంకుస్థాపన చేశారు.