ప్రతిపక్షాల కూటమి పేరు ఇండియా కాదు.. ఘమండియా

ప్రతిపక్షాల కూటమి పేరు ఇండియా కాదు.. ఘమండియా

గత కొన్ని రోజులుగా ఇండియా కూటమిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న ప్రధాని మోదీ.. మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఆ కూటమిని ఇండియా అని కాకుండా ఘమండియా అని పిలవాలని సూచించారు. ఈ హిందీ పదానికి అర్థం దురహంకారి. పార్లమెంట్ సమావేశాలు, 2024 లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్డీయే ఎంపీలతో వరుస సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే విపక్షాలు కూడా తమ కూటమి పేరును ఇండియా కూటమిగా అనౌన్స్ చేశాయి. కేంద్ర సర్కారు వ్యవస్థల్ని కాలరాస్తోందని, దానికి ధీటైన ప్రత్యామ్నాయ రాజకీయాన్ని తాము అందిస్తామని ప్రకటించాయి. ఈ కొత్త పేరుపై, విపక్ష పార్టీలపై మోదీ ఇటీవలి కాలంలో పలు విమర్శల దాడి చేస్తున్నారు.

'పేదలకు వ్యతిరేకంగా వారు ఎలా కుట్రలు పన్నుతున్నారో దాచిపెట్టేందుకు యూపీఏ నుంచి ఇండియాగా పేరు మార్చుకున్నారు. ఇండియా అనే పేరు తమ దేశభక్తిని చాటుకోవడానికి కాదుు. దేశాన్ని దోచుకోవాలనే ఉద్దేశ్యంతో' అని ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఆరోపించారు. గతేడాది బీజేపీతో తెగతెంపులు చేసుకుని, ఆర్జేడీ, కాంగ్రెస్‌లను మళ్లీ ఆదరించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురించి ప్రస్తావిస్తూ, సుస్థిర ప్రభుత్వం కోసం బీజేపీ గొప్పతనాన్ని చెప్పేందుకు ఆయనే ఉదాహరణ అని ప్రధాని అన్నారు. "నితీష్ కుమార్‌కు తక్కువ సీట్లు ఉన్నందున ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదు, అయినప్పటికీ బీజేపీ అతన్ని ముఖ్యమంత్రి చేసింది. ఇది ఎన్‌డీఏ త్యాగ భావనకు (త్యాగం)" నిదర్శనమని ఆయన చెప్పారు.