వాట్సాప్ ఛానెల్‌ లో మోదీ.. ఫస్ట్ పోస్ట్ ఇదే

వాట్సాప్ ఛానెల్‌ లో మోదీ.. ఫస్ట్ పోస్ట్ ఇదే

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ప్రధాని మోదీ.. వాట్సాప్ ఛానెల్‌ క్రియెట్ చేశారు .  అందులో తొలి పోస్ట్ పెట్టారాయన .  వాట్సాప్ కమ్యూనిటీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. ఇక నుంచి మనం ఇందులోనే  మనం ఇంటరాక్ట్ అవుదామని తెలిపారు.  కొత్త పార్లమెంటు భవనంలోని  తన  కార్యాలయంలో పనిలో నిమగ్నమై ఉన్న ఫోటోను మోదీ షేర్ చేశారు.  మోదీ చేసిన ఈ పోస్టుకు  4 గంటల్లో 30 వేల  లైక్స్ వచ్చాయి.  1.53 లక్షల మంది మోదీని ఫాలో అవుతున్నారు . 

 వాట్సాప్ ఛానెల్స్ గురించి..

వాట్సాప్ ఛానెల్స్‌తో అడ్మిన్స్ ఫాలోవర్లకు టెక్స్ట్, ఫోటోలు, వీడియోలు, స్టిక్కర్లు, పోల్స్ సెండ్ చేయవచ్చు. ఇది వన్ వే బ్రాడ్‌కాస్ట్ టూల్. వాట్సాప్ యాప్‌లోని అప్‌డేట్స్ సెక్షన్‌ కింది భాగంలో వాట్సాప్ ఛానెల్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. యూజర్ల దేశం ఆధారంగా ఆటోమెటిక్‌గా ఫిల్టర్ అయ్యే ఛానెల్స్ కనిపిస్తాయి. ఫాలోవర్స్ సంఖ్య ఆధారంగా కొత్త, అత్యంత యాక్టివ్‌గా ఉండే ఛానెల్స్, పాపులర్ ఛానెల్స్ కూడా చూడవచ్చు.