లతా మంగేష్కర్ అంత్యక్రియల్లో మోడీ

లతా మంగేష్కర్ అంత్యక్రియల్లో మోడీ

లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ అంత్యక్రియలకు సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు. చివరిసారిగా ఆమె పార్థివదేహాన్ని చూసి నివాళులు అర్పించేందుకు క్యూ కడుతున్నారు. ముంబైలోని శివాజీ పార్కులో లతాజీ అంతిమ సంస్కరాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నేతలు లతాజీని చివరిసారిగా చూసేందుకు వస్తున్నారు. ప్రధాని మోడీ కూడా ముంబై చేరుకున్నారు.లతా మంగేష్కర్ అంత్యక్రియలకు మోడీ హాజరయ్యారు. శివాజీ పార్కుకు చేరుకున్న ప్రధాని లతా మంగేష్కర్ భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. 

మోడీ తర్వాత.. ప్రముఖ బాలీవుడ్ స్టార్ షారుఖాన్ సతీ సమేతంగా లతాజీ భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. సచిన్ టెండుల్కర్ కూడా భార్యతో కలిసి లతాజీకి నివాళులర్పించారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధావ్ థాక్రే, మంత్రి ఆదిత్య థాక్రే కూడా లతాజీకి ఘన నివాళులర్పించారు. అంతకుముందు ముంబైలోని లతాజీ నివాసం నుంచి శివాజీ పార్కు వరకు అంతిమయాత్ర సాగింది. ఈ నేపథ్యంలో లెజెండరీ సింగర్‌కు తుది వీడ్కోలు పలికేందుకు భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ముంబైలోని శివాజీ పార్క్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అధికారింగా ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.