ఫాస్ట్ ట్రాక్ కోర్టులతో విద్యార్థుల సమస్య తీరదు...ధర్మేంద్ర రాజీనామా డిమాండ్ ను మోదీని పట్టించుకోవట్లే: కేజ్రీవాల్

ఫాస్ట్ ట్రాక్ కోర్టులతో విద్యార్థుల సమస్య తీరదు...ధర్మేంద్ర రాజీనామా డిమాండ్ ను మోదీని పట్టించుకోవట్లే: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: పేపర్ లీకేజీ కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆందోళన బాట పట్టిన విద్యార్థుల ప్రధాన డిమాండ్ అయిన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ప్రధాని మోదీ అసలు పట్టించుకోలేదని ‘ఎక్స్’లో ఆయన ఒక వీడియో విడుదల చేశారు. 

‘‘పేపర్ లీకేజీల విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తెస్తామని ప్రధాని మోదీ చెప్పారు. కానీ విద్యార్థులు కోరుతోంది అది కాదు. అసలు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఏమైంది? ఇప్పటికే దేశంలో అనేక అంశాలపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి. వాటి పనితీరు ఎలా ఉందో అందరికీ తెలిసిందే”అని ఆయన ఎద్దేవా చేశారు.