- హాట్ హాట్ గా పార్లమెంటు శీతాకాల సమావేశాలు
ఢిల్లీ: ప్రధాని మోదీ పార్లమెంట్‌లో ప్రతిపక్షం చేసే డిమాండ్లను “డ్రామా”గా వ్యవహరించడంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాధ్రా తీవ్రంగా స్పందించారు. ప్రజలకు కీలకమైన ఎన్నికల జాబితాల ప్రత్యేక సవరణ , కాలుష్యం, ఎన్నికల పరిస్థితి వంటి అత్యవసర సమస్యలను లేవనెత్తడమే పార్లమెంట్ పని, వాటిపై చర్చించకుండా అడ్డుకోవడమే అసలైన డ్రామా అని ఆమె కౌంటర్ ఇచ్చారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ మోదీ ప్రతిపక్షం ఎన్నికల ఫలితాలతో అసహనానికి గురవ్వద్దని, సభలో డ్రామా చేయద్దని చెప్పగా.. ప్రియాంక “సమస్యలు చెప్పడం డ్రామా కాదు, చర్చించనివ్వకపోవడే డ్రామా” అని అనటం విశేషం. బీహార్ ఎన్నికలలో మహిళల భారీ పాల్గొనడాన్ని ప్రజాస్వామ్య బలం అని మోదీ కొనియాడుతూనే విధానాలపై దృష్టి పెట్టాలని సూచించగా, మరో వైపు ఈ సమావేశాల్లో అటమిక్ ఎనర్జీ బిల్లు 2025, ఇన్సూరెన్స్ చట్ట సవరణ 2025 సహా పది బిల్లులు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో శీతాకాల సమావేశాలు వాడీ వేడిగా సాగనున్నాయి.
