ఎన్నికల ఫలితాలపై మోడీ ట్వీట్.. గుజరాత్ కు ధన్యవాదాలు చెప్పిన ప్రధాని

ఎన్నికల ఫలితాలపై మోడీ ట్వీట్.. గుజరాత్ కు ధన్యవాదాలు చెప్పిన ప్రధాని

గుజరాత్ లో బీజేపీ రికార్డు స్థాయి చారిత్రక విజయం సాధించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.  ‘‘నా సొంత రాష్ట్రం గుజరాత్ కు ధన్యవాదాలు. ఈ భారీ విజయాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యాను’’ అని పేర్కొంటూ ఆయన ట్వీట్ చేశారు. ‘‘అభివృద్ధి రాజకీయాలను ప్రజలు ఆశీర్వదించారు. రానున్న రోజుల్లోనూ ఇదే ఊపు కొనసాగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా.

గుజరాత్ జనశక్తికి నా వినమ్ర పూర్వక నమస్సుమాంజలి’’ అని ట్వీట్ లో ప్రధాని తెలిపారు. ఈ ఎన్నికల్లో తమకు అండగా నిలిచిన హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు కూడా ఆయన థ్యాంక్స్ చెప్పారు. ‘‘హిమాచల్ ప్రజల ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషిచేస్తాం. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజల సమస్యలను లేవనెత్తి మాట్లాడుతాం’’ అని మోడీ పేర్కొన్నారు.