- అభివృద్ధి పనుల కోసం వస్తుంటే.. ఆగ్రహం అనే పేరు ఎందుకన్న పీఎంవో!
- బహిరంగ సభగానే నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర బీజేపీ
- 10న పరేడ్ గ్రౌండ్స్‌లో మీటింగ్
హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా నిర్వహించ తలపెట్టిన సభ పేరులో మార్పు జరిగింది. తొలుత జనాగ్రహ సభ అని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. అయితే, ఈ పేరును ప్రధాని కార్యాలయం(పీఎంవో) తిరస్కరించింది. రాష్ట్రంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని వస్తుంటే.. ఆగ్రహం అనే పేరు పెట్టడం ఏంటని ప్రశ్నించినట్లు తెలిసింది. పార్టీ కేంద్ర నాయకత్వం సూచనల మేరకు రాష్ట్ర నాయకత్వం ఆ పేరును తొలగించి, ప్రధాని మోదీ బహిరంగ సభ పేరుతో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మీటింగ్జరగనుంది.
సోషల్ మీడియాలో ప్రచారానికి ప్లాన్
ప్రధాని సభను విజయవంతం చేసేందుకు బీజేపీ సోషల్ మీడియా కసరత్తు చేస్తోంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వేదికలుగా ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు విస్తృత ప్రచారానికి ప్లాన్ చేసింది. ప్రతిరోజు ఒక ప్రత్యేక ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లేలా షెడ్యూల్ ఖరారు చేసింది.
