మార్చి19 లోపు కేవైసీ అప్‌‌‌‌‌‌‌‌డేట్ చేసుకోండి: పీఎన్‌‌‌‌‌‌‌‌బీ

మార్చి19 లోపు కేవైసీ అప్‌‌‌‌‌‌‌‌డేట్ చేసుకోండి: పీఎన్‌‌‌‌‌‌‌‌బీ

న్యూఢిల్లీ :  ఈ నెల 19 లోపు  కేవైసీ (నో యువర్ కస్టమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) డిటైల్స్‌‌‌‌‌‌‌‌ను అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలని కస్టమర్లకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌‌‌‌‌‌‌‌బీ) తేలియజేసింది. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్ మేరకు కిందటేడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 31 లోపు కేవైసీ డిటైల్స్‌‌‌‌‌‌‌‌ను అప్‌‌‌‌‌‌‌‌డేట్ చేసుకోని వారు ఇంకో మూడు రోజుల్లో  అప్‌‌‌‌‌‌‌‌డేట్ చేసుకోవాలి. కస్టమర్లు అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌ చేసుకున్న ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డ్‌‌‌‌‌‌‌‌, ఐడీ ప్రూఫ్‌‌‌‌‌‌‌‌, తాజా ఫోటో, పాన్ కార్డ్‌‌‌‌‌‌‌‌, ఇన్‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌ ప్రూఫ్‌‌‌‌‌‌‌‌, మొబైల్ నెంబర్ లేదా ఇతర కేవైసీ ఇన్‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్‌‌‌‌‌‌‌‌ను బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన బ్రాంచ్‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌డేట్ చేసుకోవాలని సూచించింది. 

పీఎన్‌‌‌‌‌‌‌‌బీ వన్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కేవైసీ వివరాలను అప్‌‌‌‌‌‌‌‌డేట్ చేసుకోవచ్చని  పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రకటించింది. లేదా రిజిస్టర్డ్ ఈ–మెయిల్స్ లేదా పోస్టల్‌‌‌‌‌‌‌‌, డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా బ్రాంచ్‌‌‌‌‌‌‌‌కు వెళ్లి ఈ నెల 19 లోపు కేవైసీ వివరాలను అప్‌‌‌‌‌‌‌‌డేట్ చేసుకోవాలంది. ఒకవేళ ఇన్‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్‌‌‌‌‌‌‌‌ను అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌ చేసుకోకపోతే అకౌంట్‌‌‌‌‌‌‌‌పై రిస్ట్రిక్షన్లు పడతాయని, కొన్ని సందర్భాల్లో అకౌంట్ ఫ్రీజ్ అవ్వొచ్చని  పీఎన్‌‌‌‌‌‌‌‌బీ ప్రకటించింది. ఇందుకు సంబంధించి కస్టమర్లకు ఎస్‌‌‌‌‌‌‌‌ఎంఎస్ అలర్ట్స్‌‌‌‌‌‌‌‌ పంపామని పేర్కొంది. 

పీఎన్‌‌‌‌‌‌‌‌బీ కేవైసీ స్టేటస్‌‌‌‌‌‌‌‌ను ఈ కింది విధంగా చెక్ చేసుకోవచ్చు..

1) పీఎన్‌‌‌‌‌‌‌‌బీ ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో లాగిన్‌‌‌‌‌‌‌‌ అవ్వాలి.
2) పర్సనల్ సెట్టింగ్స్‌‌‌‌‌‌‌‌ ట్యాబ్‌‌‌‌‌‌‌‌లో చెక్ కేవైసీ స్టేటస్‌‌‌‌‌‌‌‌ను క్లిక్ చేయాలి. కేవైసీ వివరాలను అప్‌‌‌‌‌‌‌‌డేట్ చేయాలో లేదో  స్క్రీన్‌‌‌‌‌‌‌‌పై డిస్‌‌‌‌‌‌‌‌ప్లే అవుతుంది.