అన్ని రంగాల్లో బాన్సువాడ నంబర్ వన్ : ప్రభుత్వ సలహాదారు పోచారం

అన్ని రంగాల్లో బాన్సువాడ నంబర్ వన్ :  ప్రభుత్వ సలహాదారు పోచారం

కోటగిరి, వెలుగు: విద్య, వైద్యం, వ్యసాయం, ప్రగతి, మహిళల అభివృద్ధి వంటి అన్ని రంగాల్లో రాష్ట్రంలో బాన్సువాడ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం కల్లూరులో కొత్తగా నిర్మించిన మహిళా శక్తి భవనం, ఇందిరమ్మ ఇండ్లను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. చదువు ఒక్కటే పేదవారి తలరాతను మార్చగలదని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. 

నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మహిళా శక్తి భవనాai నిర్మిస్తున్నామని, మహిళలకు ఏ మీటింగ్ ఉన్నా అందులోనే జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో విజయకుమారి, డీఆర్డీవో పీడీ సాయన్న, పీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈఈ వీరానంద్, తహసీల్దార్ సందీప్, ఎంపీడీవో చందర్, ఏఎంసీ చైర్మన్ హన్మంతు, మాజీ జడ్పీటీసీలు శంకర్ పటేల్, పుప్పాల శంకర్, ఐకేపీ ఏపీఎం భాస్కర్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు షాజీ పటేల్, స్థానిక సర్పంచ్ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.