హైదరాబాద్ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోక్సో (POCSO) కేసులో నిందితుడికి 20 కఠిన కారాగార శిక్ష పడింది. 2026 జూన్ 05, బాలల రక్షణ, త్వరితగతిన న్యాయం అందించే దిశగా నిందితునికి శిక్ష పడేలా చేయడంలో పోలీసులు ఘన విజయం సాధించారు. ఈ కేసులో నిందితుడిని దోషిగా ఎల్ బీ నగర్ ప్రకటించిన ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు.. 20 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది.
పహడీశరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజేంద్ర అనే వ్యక్తి మైనర్ పై అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం. 96/2023 కింద ఐపిసి సెక్షన్లు 366, 344, 376(2)(n), పోక్సో (POCSO) చట్టంలోని సెక్షన్ 5 రీడ్ విత్ సెక్షన్ 6 కింద ఈ కేసు నమోదైంది. సెషన్స్ కేస్ (S.C. No. 125/2024) గా జరిగిన సుదీర్ఘ విచారణ అనంతరం నిందితుడిపై మోపిన అన్ని నేరారోపణలు నిజమని న్యాయస్థానం నిర్ధారించింది. దీంతో శిక్ష ఖరారు చేసింది ఫాస్ట్ ట్రాక్ కోర్టు
