గచ్చిబౌలి: పోక్సో కేసులో వ్యక్తికి పదేండ్ల జైలు

గచ్చిబౌలి: పోక్సో కేసులో వ్యక్తికి పదేండ్ల జైలు

గచ్చిబౌలి, వెలుగు: పోక్సో కేసులో ఓ వ్యక్తికి పదేండ్ల జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ మేడ్చల్ ఫాస్ట్​ట్రాక్​స్పెషల్​ కోర్టు జడ్జి వెంకటేశ్​తీర్పునిచ్చారు. యూపీకి చెందిన బల్బార్​అధికారి(36) మెదక్ జిల్లా ములుగు మండలం కొత్తూరులో ఉంటూ ఫాస్ట్​ఫుడ్​సెంటర్​లో పని చేస్తున్నాడు. మేడ్చల్​విలేజ్ రతంశాల ప్రాంతంలో ఓ వ్యక్తి భార్య, ముగ్గురు కుమార్తెలతో కలిసి నివసిస్తున్నాడు. 2015 జూన్ 11న తల్లిదండ్రులు సొంతూరుకు వెళ్లడంతో ఎనిమిదో తరగతి చదివే పెద్ద కుమార్తె తన ఇద్దరు చెల్లెళ్లతో కలిసి ఇంట్లోనే ఉంది. 

వీరి ఇంటి పక్కనే సోదరుడి ఇంటికి అదే రోజు బల్బార్​అధికారి వచ్చాడు. తాగడానికి నీళ్లు కావాలని ఆ బాలికను అడిగి, తర్వాత ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరుసటి రోజు బాధితురాలి ఫిర్యాదు మేరకు మేడ్చల్​పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, బల్బార్​ను అరెస్ట్​చేశారు. దర్యాప్తు చేపట్టి, కోర్టులో చార్జిషీట్ వేశారు. నేరం రుజువు కావడంతో బల్బార్​అధికారికి జడ్జి సోమవారం శిక్ష ఖరారు చేసి, బాధిత బాలికకు రూ.లక్ష పరిహారం చెల్లించాలని తీర్పు వెల్లడించారు.