హర్యానా సీఎంకు నిరసన సెగ.. రైతులపై టియర్ గ్యాస్

హర్యానా సీఎంకు నిరసన సెగ.. రైతులపై టియర్ గ్యాస్

హర్యానాలో ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ కు నిరసన సెగ తగిలింది. కర్నాల్ జిల్లాలోని కెమ్లా అనే ఊరి దగ్గర ఉన్న టోల్ ప్లాజా దగ్గర హింసాత్మక ఘటనలు జరిగాయి. ఖట్టార్ ను అడ్డుకునేందుకు రైతులు ప్రయత్నించారు. దీంతో రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. కర్నాల్ జిల్లాలో 3 వ్యవసాయ చట్టాలకు మద్దతుగా కిసాన్ మహా పంచాయత్ నిర్వహిస్తోంది బీజేపీ. కేంద్రం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలతో జరిగే లాభాలను వివరించేందుకు ఆ సభ పెట్టారు. అయితే హర్యానాకు చెందిన వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నాల్ లో సీఎం సభ పెట్టడం రైతుల ఆగ్రహానికి కారణమైంది.

ప్రతి పౌరుడికీ వ్యాక్సిన్‌‌ను ఉచితంగా అందిస్తాం