మేడ్చల్​​లో రూ.54 లక్షల క్యాష్ పట్టివేత

మేడ్చల్​​లో రూ.54 లక్షల క్యాష్ పట్టివేత

మేడ్చల్, వెలుగు: ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు.  శనివారం మేడ్చల్ టౌన్​లో  ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి రూ. 35 లక్షలు, వ్యాపారవేత్త నుంచి రూ. 13 లక్షలు, బంగారం షాప్ నుంచి  రూ. 5 లక్షల 68 వేలు, 18 తులాల గోల్డ్ స్వాధీనం చేసుకున్నారు. 

మేడ్చల్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీల్లో రూ. 62,900లను పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. పట్టుబడిన మొత్తాన్ని  స్క్రీనింగ్ కమిటీకి అందజేస్తామని సీఐ నరసింహ రెడ్డి చెప్పారు. డబ్బులు తరలించిన వ్యక్తులు సరైన ధ్రువపత్రాలను చూపిస్తే ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ పరిశీలన అనంతరం తిరిగి అప్పగిస్తామని  ఆయన వివరించారు.