
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు పోలీసులు. గొత్తికోయలు మావోయిస్టులకు సహకరిస్తున్నారనే అనుమానంతో కొండాయి, కొత్తూరు, ఐలాపూర్, దొడ్ల, కొత్తూరు, సండ్రగూడెం, చింతలమోరి, రాయబంధం, లింగపూర్, కొమురం భీమ్ గ్రామాల్లో డ్రోన్ కెమెరాలతో శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్నారు. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా నిరంతరం నిఘా పెట్టామన్నారు పోలీసులు. వచ్చే నెల 3 వరకు నిఘా కొనసాగుతుందన్నారు సీఐ కిరణ్ కుమార్,ఎస్సై శ్రీకాంత్ రెడ్డి.