
హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన కూకట్పల్లి మర్డర్ కేసులో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సోమవారం (ఆగస్టు 19) పన్నెండేళ్ల చిన్నారి సహస్రను అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపిన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. మంగళవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మృతురాలు సహస్ర కుటుంబం ఉంటున్న ఇంట్లోనే అద్దెకు ఉంటున్న సంజయ్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సహస్ర మర్డర్ తర్వాత అక్కడే తిరిగుతూ కనిపించాడు సంజయ్. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. దీనికి తోడు మరోవైపు బంధువుల హస్తం ఏమైదనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బాలనగర్ జోన్ డీసీపీ సురేష్, కూకట్ పల్లి ఏసీపీ రవి కిరణ్ రెడ్డి మరోసారి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇప్పటికే ఘటనా స్థలంలో క్లూస్ సేకరించాయి క్లూస్ టీమ్స్. బాలిక హత్య జరిగిన బిల్డింగ్ రెండో ఫ్లోర్ లోనే అద్దెకు ఉంటున్నాడు సంజయ్.
అనుమానంతో సంజయ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఘటన జరిగిన అపార్ట్ మెంట్ వద్ద సీసీ టీవీలోనిందితుడి ఆనవాళ్లు రికార్డ్ కాలేదు. దీంతోనిందితుడి గుర్తింపు కష్టతరంగా మారింది. బృందాలుగా ఏర్పడి హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా కేసు చేధించే ప్రయత్నం చేస్తున్నారు కూకట్పల్లి పోలీసులు.
కూకట్ పల్లి సంగీత్ నగర్ లో ఇంట్లో ఉన్న సహస్ర అనే పన్నెండేళ్ల చిన్నారిని దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. తల్లితండ్రులు ఇంట్లో లేని సమయంలో సహస్ర (12) అనే బాలికను హత్య చేసి పారిపోయారు దుండగులు. ఇంట్లో చనిపోయి ఉన్న కూతురును చూసిన తండ్రి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు కూకట్ పల్లి పోలీసులు. ఘటన గురించి తెలిసుకున్న స్థానికులు బాలిక ఇంటికి భారీ ఎత్తున చేరుకున్నారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. సహస్ర తండ్రి కృష్ణ బైక్ మెకానిక్. తల్లి రేణుక ల్యాబ్ టెక్నీషియన్. గత కొన్నాళ్లుగా కూకట్ పల్లిలో నివసిస్తున్నారు. ఎప్పట్లాగే తండ్రి మెకానిక్ షాపుకు, తల్లి ఉద్యోగానికి వెళ్లిన తర్వాత జరిగింది ఈ ఘటన. ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలికను చంపేశారు దుండగులు.