ఇన్సులిన్​తో 17 మందిని చంపింది

ఇన్సులిన్​తో 17 మందిని చంపింది
  • అమెరికాలో ఓ నర్సు దుశ్చర్య

న్యూఢిల్లీ: మోతాదుకు మించి ఇన్సులిన్​ ఇచ్చి ఇద్దరి మృతికి కారణమైందని పోలీసులు ఓ నర్సును అరెస్టు చేశారు. విచారణలో.. మరో 17 మందిని కూడా చంపినట్లు నర్సు వెల్లడించింది. అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా బయటపడింది. హీథర్ ప్రెస్‌‌డీ అనే నర్సు ఉద్యోగం చేస్తున్న సమయంలో వివిధ పునరావాస కేంద్రాల్లో  మొత్తం19 మందికి హాని కలిగించేందుకు ప్రయత్నించినట్లు అంగీకరించింది. 

మధుమేహ స్థితితో సంబంధంలేకుండా అధిక ఇన్సులిన్‌‌ను ఇచ్చినందుకు వారిలో ఇప్పటి వరకు17 మంది చనిపోయారని అటార్నీ జనరల్ మిచెల్ హెన్రీ ఆరోపించారు. బాధితులంతా 43 నుంచి104 ఏళ్ల మధ్య వయస్కులని చెప్పారు. ఒక నర్సు తీరుపై ఇలాంటి ఆరోపణలు రావడం ఆందోళనకరమని హెన్రీ అన్నారు.