కార్లు అద్దెకు తీసుకుంటాడు.. ఇతర రాష్ట్రాల్లో అమ్మేస్తాడు

కార్లు అద్దెకు తీసుకుంటాడు.. ఇతర రాష్ట్రాల్లో అమ్మేస్తాడు

హైదరాబాద్: చాంద్రాయణగుట్టలో కార్ల అద్దెకు తీసుకొని అమ్ముకుంటున్న మోసగాడిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడిని నుంచి కోటి 20 లక్షల రూపాయల విలువైన 8 కార్లను స్వాధీనం చేసుకున్నారు. సనత్ నగర్ కు చెందిన మహమ్మద్ అస్లం నవాజ్ కార్లను అద్దెకు తీసుకొని వ్యాపారం చేస్తుంటాడు.. ఈ క్రమంలో అద్దె క్రమం తప్పకుండా రెండు మూడు నెలలు చెల్లించేవాడు.. కారు యజమాని నమ్మిన తర్వాత ఇతరు రాష్ట్రాలకు తీసుకెళ్లి అమ్ముకునేవాడు.  కార్ల గురించి యజమానులు అడిగితే వేరే రాష్ట్రాలకు పారిపోయేవాడు.. ఇలా గతంలో జైలు కూడా వెళ్లి వచ్చాడు.

ALSO READ :మంత్రి గంగుల కమలాకర్కు ఈడీ నోటీసులు

పక్కా సమాచారంతో చంద్రాయణ గుట్ట పోలీసులు నిందితుడిని చంద్రాయణ గుట్ట ఎక్స్ రోడ్ అదుపులోకి తీసుకొని విచారించగా.. నేరాన్ని ఒప్పుకున్నాడు. అమ్మిన కార్ల వివరాలను తెలిపాడు. దీంతో 8 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

అయితే హైదరాబాద్ లో  క్లీన్ ఆఫ్ డార్క్ ఏరియాస్ పేరుతో కార్డన్ సెర్చ్ చేపడుతున్నాం.. నేరాలకు పాల్పడితే సహించబోమని డీసీపీ తెలిపారు. యువత నేరాల బాట పట్టవద్దని, చిన్న చిన్న నేరాలు చేసినా వదలమని, నేరాలకు పాల్పడితే రౌడీషీట్, పీడీ యాక్ట్ ద్వారా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.