మంత్రి గంగుల కమలాకర్కు ఈడీ నోటీసులు

మంత్రి గంగుల కమలాకర్కు ఈడీ నోటీసులు

బీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ కు ఈడీ షాకిచ్చింది. ఫెమా(విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం)ను ఉల్లంఘించినందుకుమంత్రి గంగుల  కుటుంబ సభ్యులకు ఈడీ నోటీసులు జారీ చేసింది.  శ్వేతా గ్రానైట్స్, శ్వేతా ఏజెన్సీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. 

 శ్వేతా గ్రానైట్ కంపెనీలు చైనాకు గ్రానైట్ మెటీరియల్ను  ఎగుమతి చేయడంలో అవకతవకలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.  హవాలా ద్వారా నగదును రవాణా చేసినట్లు ఆధారాలు సేకరించినట్లు కూడా ఈడీ జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు.  ప్రభుత్వానికి రూ. 3కోట్లు మాత్రమే చెల్లించగా.. దాదాపు రూ.50కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పారు. 

ALSO READ :మాదిగల అస్థిత్వం.. ఆత్మగౌరవం కోసమే.. పార్టీ మార్పుపై రాజయ్య కీలక ప్రకటన

2022 నవంబర్లో కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావోపేట్ లోని గ్రానైట్ కంపెనీలపై ఈడీ, ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు మూడు రోజుల పాటు సోదాలు నిర్వహించారు. శ్వేతా గ్రానైట్స్ అధికారిక చిరునామాగా ఉన్న గంగుల కమలాకర్ ఇంట్లోనూ ఈడీ  తనిఖీలు చేసింది.  శ్వేత గ్రానైట్ కంపెనీలు, శ్వేత ఏజెన్సీల నుండి రూల్ 26 (3)/ (i) m). AP MMC 1996 చట్టం ప్రకారం పెనాల్టీ, సీగ్నియరేజీని వసూలు చేయాలని అధికారులు సంబంధిత అధికారులకు సూచించారు. 

ఈడీ నోటీసులపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. ఈడీ నోటీసులపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. తమ కుటుంబానికి చెందిన శ్వేత గ్రానైట్ , శ్వేత ఏజెన్సీ 30  ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తోందని తెలిపారు.  ఈడీ అధికారులు, ఐటీ శాఖ అధికారులు ఏంఅడిగినా... వాటికి  సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇప్పటికే అన్ని డాక్యుమెంట్లు సబ్మిట్ చేశామన్నారు. మళ్లీ ఎన్ని డాక్యుమెంట్లు అడిగిన ఇస్తామన్నారు. 2008 నుండి జరుగుతున్న ఇష్యూ ఇది అని..ఇప్పుడు  కొత్తదేమీ కాదన్నారు. చాలా మంది రూ.750 కోట్లు కట్టాలని దుష్ప్రాచారం చేస్తున్నారని మండిపడ్డారు.  తాము హవాలా ద్వారా మార్కెట్ చేయలేదని వెల్లడించారు. విదేశాలకి గ్రానైట్  అక్రమంగా పంపలేదన్నారు.