
జీడిమెట్ల, వెలుగు : ఇంటి ముందు పార్కింగ్ చేసిన బైక్‌లను టార్గెట్ గా చేసుకుని చోరీ చేస్తున్న దొంగలను పేట్‌బషీరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఏసీపీ రాములు శుక్రవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కామారెడ్డికి చెందిన ఆటో మెకానిక్ బక్కోల్ల నవీన్‌గౌడ్(34) , పెయింటర్ పల్లికొండ దేవరాజ్(32), స్టూడెంట్ ఎనుగుర్తి ప్రశాంత్(19)లు కలిసి జల్సాల కోసం బైక్ ను చోరీ చేస్తున్నారు.
బాధితుల కంప్లయింట్లతో రాచకొండ, సైబరాబాద్కమిషనరేట్ పోలీసులు నిఘా పెట్టగా.. పేట్బషీరాబాద్పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద 20 బైక్‌లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కి తరలించారు.