బడ్జెట్ లో నిరుద్యోగుల ప్రస్తావన ఏది: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

బడ్జెట్ లో నిరుద్యోగుల ప్రస్తావన ఏది: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

తెలంగాణ బడ్జెట్ 2026-27పై జాగృతి  అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ లో నిరుద్యోగుల ప్రస్తావనే లేదని విమర్శించారు.బడ్జెట్ ప్రజాసంక్షేమానికి వ్యతిరేకంగా, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేలా ఉందని ఆమె విమర్శించారు. ప్రతి వ్యక్తిపై రూ. 2.16 లక్షల అప్పు భారం పడుతుందని ఆరోపిస్తూ, కాంగ్రెస్ హామీల అమలుపై ప్రశ్నలు లేవనెత్తారు. 

రైతు రుణమాఫీ, ఆరు గ్యారెంటీల అమలుకు బడ్జెట్‌లో స్పష్టమైన కేటాయింపులు లేవని ఇది ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. బడ్జెట్ పేదలకు, సామాన్యులకు భారం పడేలా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇది కేవలం అంకెల గారడీ  బడ్జెట్ అని అన్నారు. 

 జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. స్కిల్ వర్సిటీ  అంటూ  సర్కార్ డబ్బా కొట్టుకుంటోంది.. స్కిల్ వర్సిటీ కి ఒక్క కూపాయి కూడా కేటాయించలేదన్నారు. ఆరు గ్యారంటీలకు ఊసే లేదన్నారు. తెలంగాణలో ప్రజల ఆహారంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతోంది.. రాష్ట్ర వ్యాప్తంగా  ఫుడ్ కల్తీ జోరుగా జరుగుతోంది.. తనిఖీలు,  కేసులతోనే  ప్రభుత్వం  సరిపెడుతోంది.. ఫుడ్ కల్తీ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.