హైదరాబాద్ గచ్చిబౌలిలో నాటు సారా కలకలం.. ఇద్దరు అరెస్ట్..

హైదరాబాద్ గచ్చిబౌలిలో నాటు సారా కలకలం.. ఇద్దరు అరెస్ట్..

హైదరాబాద్ గచ్చిబౌలిలో నాటు సారా కలకలం రేపింది. గచ్చిబౌలిలోని నానక్ రామ్ గూడలో నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ శాఖ రంగారెడ్డి జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు. గురువారం ( అక్టోబర్ 9 ) దాడులు నిర్వహించిన అధికారులు నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. గచ్చిబౌలి నానక్ రామ్ గూడలో నాటుసారా అమ్మకాలపై పక్కా సమాచారం అందుకున్న అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

ధూల్ పేట్ కి చెందిన రాధికా బాయ్, శంకర్ లు నానక్ రామ్ గూడలో నాటు సారా అమ్ముతుండగా పట్టుకున్నారు అధికారులు. నిందితుల దగ్గర నుంచి పది లీటర్ల నాటు సారా, స్కూటీ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. నిందితులు ధూల్ పేటలో నాటుసారా తయారు చేసి నానక్ రామ్ గూడలో అమ్ముతున్నట్లు తెలిపారు అధికారులు. లీటర్ నాటుసారా రూ. 4 వందలకు అమ్ముతున్నట్లు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.