ప్రియాంకా గాంధీపై పోలీసుల దాడి

ప్రియాంకా గాంధీపై పోలీసుల దాడి

ఉత్తరప్రదేశ్  లక్నో పర్యటనలో కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీకి చేదు అనుభవం ఎదురైంది.పౌరహక్కు చట్ట సవరణ వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేసిన మాజీ ఐఎఎస్ అధికారి దారపురిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ క్రమంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త టు వీలర్ పై ప్రయాణించి వారి ఇంటికి చేరుకున్నారు. ఆ కుటుంబాన్ని పరామర్శి వస్తుండగా ప్రియాంకా గాంధీని మహిళా పోలీసులు అడ్డుకున్నారు. ఆమె గొంతుపై చేయి  వేసి తోసి వేశారు. ఈ ఘటనతో ఆమె షాక్ కు లోనయ్యారు. వెంటనే తేరుకుని అక్కడ నుంచి కాలినడకన సమీపంలోని మీడియా పాయింట్ కు చేరుకుని.. తనపై పోలీసులు చేసిన దాడిని ప్రియాంక తెలిపారు.