ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో యువకుడు.. చేయకూడని పని చేసి అరెస్టయ్యాడు

ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో యువకుడు.. చేయకూడని పని చేసి అరెస్టయ్యాడు

గొప్పలకు పోయి తిప్పలు కొని తెచ్చుకోవడం అంటే ఇదేనేమో అనుకుంటూ.. రీల్స్ చేసి వైరల్ కావాలి. ఈమద్యకాలం సోషల్ మీడియాలో లైక్స్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. షేర్స్ కోసం సిగ్గలేకుండా దిగజారిపోతున్నారు. రాత్రికి రాత్రి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాల్సిందే.. అదే కొంతమంది వీరి లక్ష్యం. సోషల్ మీడయాలో హైలెట్ అయితే టీవీ షోలోకి పిలుస్తారు. అలా అలా సినిమాల్లోని వెళ్లొచ్చని చాలామంది రీల్స్ చేయడం కోసం నానా తంటాలు పడుతున్నారు. ఢిల్లీలో ప్రదీప్ ధకజాత్ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేసి పోస్ట్ చేశాడు. రీల్ కోసం తీసిని వీడియోలో ఢిల్లీ పోలీస్ బారికేడ్స్ కు నిప్పు పెట్టాడు. 


శుక్రవారం రాత్రి ఢిల్లీలోని పశ్చిమ విహార్ ఫ్లైఓవర్‌పై ఓ గోల్డ్ కలర్ కార్ వేసుకొని, మెడలో బంగారు గొలుసులు ధరించి.. ఓ మాస్ ఎంట్రీ బ్యాగ్ గ్రౌండ్ సాంగ్ పెట్టి ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేశాడు. ఇంత వరకు బానే ఉంది.. కానీ ఈ వీడియోలో తన రాయల్టీని చూపించడానికి రోడ్డుపై ఉన్న పోలీస్ బారికేడ్లను నిప్పు పెట్టాడు. ఈవీడియో ఇంటర్నెట్ లో బాగా వైరలైంది. నెటిజన్లు ప్రదీప్ చేసినదానికి మండిపడ్డారు. ఆ వీడియో కామెంట్ బాక్స్‌లో  ఫుల్లగా తిట్టేశారు. పోలీసులు ఈ వీడియోపై సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే ఒక్కరోజులోని పోలీసులు ఆయువకుడిని పట్టుకొని నిహాల్ విహార్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు. హైదరాబాద్‌లో కూడా రీల్ వీడియోస్స్ కోసం యువకులు నైట్ టైం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, రోడ్డు మధ్యలో బైక్స్‌పై స్టంట్స్ చేస్తున్నారు. పోలీసుల దృష్టికి వెళ్తే వారి పని కూడా ఇదే పరిస్థితి.