ఢిల్లీ సరిహద్దులో ఉద్రిక్తత.. భారీగా బలగాల మోహరింపు

ఢిల్లీ సరిహద్దులో ఉద్రిక్తత.. భారీగా బలగాల మోహరింపు

ఢిల్లీ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు  ఏర్పడ్డాయి. కిసాన్ రిపబ్లిక్ పరేడ్ నేపథ్యంలో ఢిల్లీలో ఉద్రిక్తతలతో.. అధికారులు చర్యలు ప్రారంభించారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్న రైతులను ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘాజీ పూర్ బార్డర్ లో ఉన్న రైతులు ఖాళీ చేసి వెళ్లిపోవాలని స్థానిక కలెక్టర్ ఆదేశాలిచ్చారు. మరోవైపు.. ఇవాళ ఉదయం నుంచి సింఘూ, ఘాజీపూర్ బార్డర్ లో భారీగా పోలీసులు మోహరించారు. ఆందోళన చేస్తున్నవారు ఢిల్లీలోకి రాకుండా బారికేడ్లు పెట్టారు. సింఘూ బార్డర్ లో ఢిల్లీ-హర్యానాను కలిపే రహాదారిని జేసీబీతో తవ్వించేశారు. మరోవైపు.. జాతీయ జెండాను అవమానించారంటూ.. సింఘూలో రైతుల శిబిరం దగ్గర స్థానికులు ఆందోళన చేశారు. వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు.

అయితే.. ఎర్రకోట దగ్గర జరిగిన హింసకు బీజేపీనే కారణమన్నారు భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేష్ టికైత్. ఎర్రకోటపై జెండా పెట్టిన వారెవరో తేల్చాలన్నారు. దీనిపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలన్నారు. బీజేపీ నేతలను ఎగదోసి.. తమ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.