చాహల్ పై యువరాజ్ సింగ్ కామెంట్స్..పోలీస్‌‌ కేసు నమోదు

చాహల్ పై యువరాజ్ సింగ్ కామెంట్స్..పోలీస్‌‌ కేసు నమోదు

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఆల్‌‌రౌండర్‌‌ యువరాజ్‌‌సింగ్‌‌ పోలీసు కేసులో ఇరుక్కున్నాడు.  ఓ కులానికి సంబంధించి కొన్ని కామెంట్లు చేయడంతో అతనిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఇటీవల యువరాజ్‌‌.. రోహిత్‌‌తో ఇన్‌‌స్టాగ్రామ్‌‌ లైవ్‌‌లో మాట్లాడాడు. ఈ సందర్భంగా స్పిన్నర్​ చహల్‌‌ గురించి వచ్చిన ప్రస్తావన రావడంతో..  కుటుంబ సభ్యులతో కలిసి చేసిన వీడియోలను ఎందుకు పోస్ట్‌‌ చేస్తున్నాడని, వీళ్లకు ఏం పని లేదా? అంటూ యువీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. మాటల మధ్యలో యువీ.. ‘భంగి’ (ఓ కులం) అనే పదాన్ని ఉపయోగించడంతో వివాదం మొదలైంది. ఈ పదం విని రోహిత్‌‌ కూడా నవ్వాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌‌ మీడియాలో వైరల్‌‌ కావడంతో.. హర్యానాకు చెందిన దళిత హక్కుల నేత, అడ్వకేట్‌‌ రజత్‌‌ కల్సాన్‌‌.. హిస్సార్‌‌లోని హన్సీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే యువీని అరెస్ట్‌‌ చేయాలని డిమాండ్‌‌ చేశారు. రోహిత్‌‌పై కూడా విమర్శలు చేశారు. యువీ ఆ మాట అన్నప్పుడు హిట్‌‌మ్యాన్‌‌ వ్యతిరేకించాల్సిందన్నారు. ఆ వీడియోలను పోలీసులకు అందజేశానని చెప్పారు.

డిఫ్రెషన్ లో చిక్కుకుని చావాలనుకున్న