టీఆర్ఎస్ జెండా ఎత్తుకెళ్లిన దొంగలు..డాగ్‌స్క్వాడ్‌తో ఊరంతా వెతికిన పోలీసులు

టీఆర్ఎస్ జెండా ఎత్తుకెళ్లిన దొంగలు..డాగ్‌స్క్వాడ్‌తో ఊరంతా వెతికిన పోలీసులు

టీఆర్ఎస్ జెండా కోసం డాగ్ స్వ్కాడ్ తో వెతికించారు. ఊరంతా పోలీసు జాగిలాలతో తిరిగారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని మల్లేమోనిగూడలో ఈ ఘటన జరిగింది. నిన్నరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు టీఆర్ఎస్ జెండా ఎత్తుకెళ్లారని టీఆరెస్ కార్యకర్తలు పరిగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.  దీంతో వెంటనే డాగ్ స్క్వాడ్ ను పిలిచి మల్లెమోనిగూడలో గల్లీగల్లీ గాలించారు. గల్లీల్లో డాగ్ స్క్వాడ్ తిరుగుతుంటే స్థానిక జనం ఆశ్చర్యపోయారు.  పెద్ద పెద్ద దొంగతనాలు, మర్డర్లను పట్టించుకకోని పోలీసులు.. అధికార పార్టీ జెండా పోతే ఇలా వెతకడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.